Sunday, March 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆలయ అభివృద్ధికి రూ.1 లక్ష విరాళం

ఆలయ అభివృద్ధికి రూ.1 లక్ష విరాళం

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని నాగపూర్ గ్రామంలోని పురాతన రామాలయం అభివృద్ధికి గ్రామానికి చెందిన పి. శ్రీనివాస్ రెడ్డి రూ.లక్ష విరాళం అందజేశారు. గ్రామంలో శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొనేందుకు విచ్చేసిన ఆయన ఈ మేరకు ఆదివారం స్థానిక గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులను కలిసి రామాలయం అభివృద్ధికి తనవంతుగా రూ.లక్ష విరాళం అందించారు. రామాలయం అభివృద్ధికి రూ.లక్ష విరాళంగా అందజేసిన శ్రీనివాస్ రెడ్డిని గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.

వారికి, వారి కుటుంబ సభ్యులకు సీతారాముల ఆశీస్సులు ఉండాలని గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ కంపదండి అశోక్, ఉప సర్పంచ్ ఉల్లెంగుల శశిధర్,  గ్రామ అభివృద్ధి కమిటి అధ్యక్షులు కంపదండి తిరుపతి, ఉపాధ్యక్షులు మొకినిపల్లి సురేష్, కోశాధికారి ఏముగంటి శ్రీనివాస్ గౌడ్, కమిటీ సభ్యులు బసకొండ శ్రీనివాస్, ఈర్నాల బాబురావు, గడ్డం గోవర్ధన్, చెట్లపల్లి విట్టల్, రాథోడ్ సాగర్, పార్వతి రాజేష్, ముద్దుల హరీష్, చిడబోయిన రవికుమార్, శ్రీరాముల శ్రీనివాస్, ధోన్ పాల్ రాజకుమార్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -