- Advertisement -
– గ్రామ సర్పంచ్ తోడేటి రమేష్
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ మండలంలోని పందిళ్ళ గ్రామంలోని శ్రీ మహాలింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణం కోసం బుధవారం గ్రామానికి చెందిన అలువోజు వినోద శంకరయ్య దంపతులు రూ.5 వేల రూపాయలు గ్రామ సర్పంచ్ తోడేటి రమేష్ కు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ రమేష్ మాట్లాడుతూ శ్రీ మహాలింగేశ్వర ఆలయ నిర్మాణం కోసం దాతలు ముందుకు వచ్చి సహకరిస్తున్నారన్నారు. విరాళాలు అందించిన కుటుంబ సభ్యులకు ఆలయ కమిటీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -



