- Advertisement -
నవతెలంగాణ-పాలకుర్తి
పాలకుర్తి గ్రామానికి చెందిన వీరమనేని మౌనిక, పార్వతి, బిక్షపతి రావులు దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని సోమవారం వల్మిడి లోగల శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి 27 వేల విలువచేసే వెండి తీర్థ పాత్ర ఉద్ధరణిని బహుకరించారు. ఆలయ అభివృద్ధికి దాతల కృషి అభినందనీయమని ఆలయ అధికారులు అన్నారు. దాతలు ఆలయ అభివృద్ధికి ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు చక్రవర్తుల సుందరాచార్యులు, సిబ్బంది మోకాటి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -