Sunday, March 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్శాశ్వత అన్న ప్రసాద నిధికి విరాళం

శాశ్వత అన్న ప్రసాద నిధికి విరాళం

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండల కేంద్రం శివారులోని పాటీ హనుమాన్ దేవాలయం శాశ్వత అన్న ప్రసాద నిధికి జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం ఆత్మకూరు గ్రామానికి చెందిన నడికట్ల అమరేంద్ర మౌనిక దంపతులు విరాళాన్ని అందజేశారు. ఈ మేరకు ఆదివారం  హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన నడికట్ల అమరేంద్ర మౌనిక దంపతులు శాశ్వత అన్న ప్రసాద నిధికి తమ వంతు సహకారంగా రూ.10వేల116 నగదు మొత్తాన్ని విరాళంగా ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులకు అందజేశారు.

ఆలయం వద్ద ప్రతి శనివారం నిర్వహించే అన్న ప్రసాద కార్యక్రమానికి తమకు తోచిన మేర విరాళంగా అందించినట్లు   అమరేంద్ర మౌనిక దంపతులు తెలిపారు. వీరికి ఆలయ పూజారి స్వామి వారి ఆశీర్వాదంతో పాటు తీర్థ ప్రసాదాలను అందజేశారు. శాశ్వత అన్నప్రసాద నిధికి రూ.10వేల116 మొత్తాన్ని విరాళంగా అందించి సహకరించిన అమరేంద్ర మౌనిక దంపతులకు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు జ్ఞాపికను అందజేసి, కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -