Saturday, March 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్హనుమాన్ స్వాములకు అన్నదారం ఏర్పాటు చేసిన డోన్గావ్ సర్పంచ్ 

హనుమాన్ స్వాములకు అన్నదారం ఏర్పాటు చేసిన డోన్గావ్ సర్పంచ్ 

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని డోన్గావ్ గ్రామ పంచాయితీ సర్పంచ్ కె. శ్రీనివాస్ మండలంలోని పలు గ్రామాల హనుమాన్ దీక్ష వేసుకున్న స్వాములకు ఆ అన్నదాన ప్రసాదం బీక్ష ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హనుమాన్ దీక్ష స్వాములతో పాటు గ్రామస్తులు గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక హనుమాన్ పూజలో పాల్గొన్నారు. ఈ పూజా కార్యక్రమానికి పలు గ్రామాల్లో నుంచి మహిళలు భారీగా తరలివచ్చారు.

డోన్ గావ్ గ్రామంలో హనుమాన్ పూజ నిర్వహిస్తున్న క్రమంలో గ్రామమంతా భక్తిశ్రద్ధలతో ప్రజలు మయమర్చి పోయారు. ఎన్నికల్లో గెలిచిన నాటినుండి గ్రామస్తులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించాలని అనుకున్నారని గెలిచినా అనంతరం ప్రస్తుతం తన కోరికను నెరవేర్చడం జరిగిందని హనుమాన్ స్వాముల ఆశీర్వాచనాలు పొందానని తనకు తృప్తిగా ఉందని గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ అన్నారు. హనుమాన్ పూజ దీక్ష కార్యక్రమంలో గ్రామం ప్రజలు , మహిళలు,  యువకులు , మండలంలోని పలు గ్రామాల హనుమాన్ దీక్ష స్వాములు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -