Monday, May 12, 2025
Homeకరీంనగర్గాడిద... దేవుడు ఎప్పుడు అయ్యే...!

గాడిద… దేవుడు ఎప్పుడు అయ్యే…!

- Advertisement -
  • – కేటీఆర్ సేన ను ప్రశ్నించిన… మునిగేల 
  • నవతెలంగాణ – తంగళ్ళపల్లి
  • కేటీఆర్ ను గాడిదతో పోల్చిన మెంగని మనోహర్ కు ఇప్పుడు కేటీఆర్ దేవుడెట్ల అయ్యిండో చెప్పాలని యూత్ కాంగ్రెస్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ మునిగేలా రాజు ప్రశ్నించారు. తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం మునిగేల రాజు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రజల్లో పార్టీ ప్రాబల్యం తగ్గిందనే నెపంతో సేనాల పేరుతో కొత్త దుకాణం తెరిచారని ఎద్దేవ చేశారు.గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయంలో వారు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి సేనలు ఏర్పాటు చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్మే స్థితిలో లేరనీ సేనాలా పేరుతో ముందుకొస్తున్నారన్నారు.పార్టీ ఒకటే తప్ప సేనలు లేవని గతంలో ప్రకటించి ఇప్పుడెందుకు ఏర్పాటు చేస్తున్నారో అర్ధం అయుతలేదన్నారు. ప్రజా ప్రభుత్వంలో సేనల పేరుతో అవినీతి అక్రమాలకు పాల్పడితే సహించేది లేదన్నారు. ఈ సమావేశంలో యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు చుక్క శేఖర్, మండల యూత్ అధ్యక్షులు ప్రశాంత్, హుమెన్ రైట్స్ అధ్యక్షులు గుగ్గిళ్ళ భారత్, సోషల్ మీడియా అధ్యక్షుడు చోటు, సోషల్ మీడియా నియోజకవర్గం అధ్యక్షులు గుగ్గిల అభినయ్, యూత్ జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎడ్ల తిరుపతి, భాను, యోగి, వినోద్, దేవదాస్, ప్రశాంత్, చందు, మణి, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -