Friday, February 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సాగునీటి సరఫరాకు సహకరించిన దాత

సాగునీటి సరఫరాకు సహకరించిన దాత

- Advertisement -

నవతెలంగాణ – చిన్నకోడూరు
గత పాలకులు మధ్యలోనే కాలువ పనులు ఆపేయడంతో సాగునీరు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం విషయం తెలుసుకున్న పారిశ్రామికవేత్త వంగ రాజేశ్వర్ రెడ్డి వెంటనే స్పందించి తన వంతు సహకారంగా కాల్వ పనుల నిమిత్తం రూ. 10 వేలు అందజేశారు. మండల పరిధిలోని రంగనాయకసాగర్ కాలువ నుండి ఎల్లమ్మ జాలు మీదుగా దేవతల ఒర్రె ద్వారా మేడిపల్లి మంగనోని కుంట పనులను జెసిబి ద్వారా కాల్వ పనులు చేపట్టారు. ఈ సందర్భంగా మేడిపల్లి  రైతులందరూ వంగ రాజేశ్వర్ రెడ్డి కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతులు పిట్టల భీమయ్య, ఊపిరెడ్డి రాజిరెడ్డి, కాశ బోయిన దేవయ్య, బోనాల బాలయ్య, నూనె పోచయ్య, గుమ్మం తిరుపతి, తదుపరి నాయకులు రోహిత్ రెడ్డి, అల్లెపు సందీప్, పడిగే లింగం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -