Tuesday, March 10, 2026
E-PAPER
Homeఖమ్మంబ్యాట్మెంటన్ కోచ్ అమరేసి లింగయ్యకు దాతల ఆర్థిక చేయూత 

బ్యాట్మెంటన్ కోచ్ అమరేసి లింగయ్యకు దాతల ఆర్థిక చేయూత 

- Advertisement -

నవతెలంగాణ – బోనకల్ 
మండల పరిధిలోని ముష్టికుంట్ల గ్రామానికి చెందిన ప్రముఖ బాల్ బ్యాట్మెంటన్ కోచ్ అమరేసి లింగయ్యకు పలువురు దాతలు ముష్టికుంట్లలో మంగళవారం ఆర్థిక సహకారం అందజేశారు. లింగయ్య గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఇటీవల బోనకల్ ప్రెస్ క్లబ్ (అక్రిడిటేషన్) క్లబ్ ఆధ్వర్యంలో రూ.5000 అందజేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని కాంగ్రెస్ జిల్లా సీనియర్ నాయకులు కలకోట గ్రామానికి చెందిన పైడిపల్లి కిషోర్ కుమార్ రూ.5000 ముష్టికుంట్ల గ్రామ సర్పంచ్ పిల్లలమర్రి నాగేశ్వరరావు రూ. 5000 రూపాయల ఆర్థిక సహకారం అందించారు.

లింగయ్య బోనకల్ ముష్టికుంట్ల గ్రామాలకు చెందిన సుమారు 200 మంది బాల్ బ్యాట్మెంటన్ క్రీడాకారులను తయారు చేశారు. ఈ క్రీడాకారులు నేడు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అనేక పోటీలలో పాల్గొని తమ సత్తా చాటుతున్నారు. రాష్ట్రస్థాయి జట్టు అనగానే బోనకల్ బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారులే ఉండటం విశేషం. జాతీయస్థాయి బాల్ బ్యాట్మెంటన్ జట్టులో కూడా పలువురు బోనకల్ చెందిన క్రీడాకారులు ఉండటం మరో విశేషం. ఈ విధంగా ఎంతోమంది బాలు బ్యాడ్మింటన్ క్రీడాకారులు తయారుచేసిన లింగయ్య గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

స్పందించి వైద్య సహాయం కోసం ఆర్థిక చేయూత అందిస్తున్నారు. అతి నిరుపేదనైన తనకు వైద్యం ఖర్చులకోసం ఆర్థిక సహకారం అందించి సహకరించాలని అమరేసి లింగయ్య కోరుతున్నారు. ఆర్థిక సహకారం అందించేవారు 9989840622 నెంబర్ ను సంప్రదించాలని లింగయ్య కోరారు. ఈ కార్యక్రమంలో ముష్టికుంట్ల ఉపసర్పంచ్ అమరేసి సీతయ్య, మధిర మాజీ ఏఎంసీ చైర్మన్ బంధం శ్రీనివాసరావు, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బోయినపల్లి వెంకటేశ్వర్లు, నాయకులు బోయినపల్లి మురళి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -