మండల విద్యాశాఖాధికారి బుధారపు శ్రీనివాస్
సేవా తరుణి ఆధ్వర్యంలో పాఠ్య సామాగ్రిని అందజేత
నవతెలంగాణ – పెద్దవంగర : ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులను ప్రోత్సహించి, విద్యను బలోపేతం చేసేందుకు దాతలు ముందుకు రావాలని మండల విద్యాశాఖ అధికారి బుధారపు శ్రీనివాస్ పిలుపునిచ్చారు. లయన్స్ క్లబ్ సేవా తరుణి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పోచారం ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పాఠ్య సామాగ్రిని ఎంఈవో చేతుల మీదుగా మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన సేవా తరుణి అధ్యక్షురాలు వాణి, సేవా తరుణి డీసీ, సీడబ్ల్యూసీ చైర్ పర్సన్ డాక్టర్ నాగవాణి, క్లబ్ ట్రెజరరీ గాదె మని, క్లబ్బు ఐపీపీ ప్రెసిడెంట్ శైలజ తో కలిసి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని కోరారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు తమ సొంత డబ్బులతో విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్, వాటర్ బాటిల్స్ అందజేశారు. వందేమాతరం ఫౌండేషన్ వారు అందించిన శ్రీ బాసర జ్ఞాన సరస్వతి సన్నిధిలో పూజ చేయించిన పలుకలతో సామూహిక అక్షరాభ్యాసాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పోచారం గ్రామ ప్రత్యేక అధికారి శేషవల్లి, ఏఏపీసీ చైర్ పర్సన్ బానోత్ సునీత, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కొలిపాక బాలరాజు, ఉపాధ్యాయులు మురళీ, గ్రామస్తులు పాల్గొన్నారు.
విద్యాభివృద్ధికి దాతలు ముందుకు రావాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES