- Advertisement -
నవతెలంగాణ ఆర్మూర్
గుడి నిర్మాణానికి దాతలు ముందుకు రావాలని తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ వన్నెల్ దేవి లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ అన్నారు. పట్టణంలో పునః నిర్మితమవుతున్న శ్రీ వెంకటేశ్వర మందిర నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలను శ్రీ వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, గోదాదేవి విగ్రహాల కోసం అందజేసినట్లు గురువారం తెలిపారు. స్వామివారి దయతో అందరూ బాగుండాలని కోరుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా పెర్కిట్ గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ అయ్యప్ప శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు సదా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -