నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలో ప్రధాన ఆలయంలో భాగంగా పాత బస్టాండ్ సమీపంలో గల హనుమాన్ ఆలయం కు పేరు ప్రతిష్ట కలిగిన హనుమాన్ ఆలయంగా పేరుగాంచింది. ఈ ఆలయ పునర నిర్మాణ అభివృద్ధి పనులకు గ్రామస్తులకు పార్టీలకు అతీతంగా కులమత భేదాలకు అతీతంగా ఈ గుడి ఆలయ డెవలప్మెంట్ కు ఎంతోకొంత సహాయ సహకారాలు అందించాలని ఆలయ కమిటీ విజ్ఞప్తి చేస్తున్నారు. మద్నూర్ లో పెళ్లి అవుతుందే అంటే వేరే ఊరు నుంచి వచ్చిన పిల్ల అంటే మన ఊరు కోడలు సైతం ఈ ఆలయం వద్దనే వచ్చి కూర్చొని మొక్కులు చెల్లించుకుంటారు. అత్యధికంగా రథోత్సవ కార్యక్రమం భక్తులు చేపడతారు. ఆ రథోత్సవం కూడా ఈ ఆలయ చుట్టు ప్రదక్షిణాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.
ప్రతి శుభకార్యానికి ఈ గుడికి సంబంధం ఉంది. మనము ఈ విధంగా మద్నూర్ వాసులు డెవలప్ అయితున్నారంటే ఈ గుడి యొక్క ఆశీర్వాదం మనందరిపై ఉంది. ఈ ఆలయ పునర్నిర్మాణానికి అందరి చేయూత అందించి, సహాయము చేయాలని ఆలయ కమిటీ వేడుకుంటుంది. దీనికి అందరం ముందుకు వచ్చి తన వంతు ఎంతో కొంత సహాయం విరాళాలు ఇవ్వాలని కోరింది. రైతులు, వ్యాపార వేత్తలు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు, భక్తులు తదితరులందరూ స్వతహాగా ముందుకు వచ్చి ఆలయ అభివృద్దికి చేయూతనందించాలని ఆలయ కమిటీ విజ్ఞప్తి చేసింది.
హనుమాన్ ఆలయ పునర్నిర్మాణానికి దాతలు ముందుకురావాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES