- Advertisement -
నవతెలంగాణ – మిర్యాలగూడ
ప్రభుత్వ పాఠశాలకు దాతల సహాయం అభినందనయమని మండల విద్యాధికారి బాలు నాయక్ అన్నారు. ప్రాథమిక పాఠశాల ఉట్లపల్లి లో ఇటీవల పదోన్నతి పై వచ్చిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఎస్ కే సలీమా ప్రభుత్వ పాఠశాలకు 20వేల విలువైన టీవీ ను బహుకరించారు విద్యార్థులకు సులభంగా బోధించడానికి డిజిటల్ తరగతి మాదిరిగా తరగతి గదులను మార్చవలసిన సమయంలో స్వంత ఖర్చులతో సమకూర్చన్నారు. విద్యార్థుల సామర్ధ్యాలను పరిశీలించారు.
- Advertisement -