మండల వ్యవసాయ అధికారి సాహస్
నవతెలంగాణ-మర్రిగూడ
రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, సీసీఐ కొనుగోలు కేంద్రాలలో పత్తిని అమ్ముకొని ప్రభుత్వ ఇచ్చిన మద్దతు ధరను పొందాలని మండల వ్యవసాయ అధికారి మర్రు సాహస్ అన్నారు. బుధవారం మండలంలోని కొట్టాల గ్రామంలో కపాస్ కిసాన్ యాప్ పై రైతులకు అవగాహన కల్పించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. పత్తి అమ్మేందుకు రైతులు తప్పనిసరిగా కపాస్ కిసాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకొని అందులోని స్లాట్ బుకింగ్ చేసుకొని సీసీఐ కొనుగోలు కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. మండలంలో రెండు సిసిఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని1.లక్ష్మీ నరసింహ ఆగ్రో ఇండస్ట్రీస్ ఎరగండ్లపల్లి,2.హరిహర అగ్ర ఇండస్ట్రీ సరంపేట అని తెలిపారు. యాప్ కి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే సమీప వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి, రైతులు పాల్గొన్నారు.
దళారులను నమ్మి మోసపోవద్దు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES