Friday, October 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దళారులకు ధాన్యాన్ని అమ్మి మోసపోవద్దు

దళారులకు ధాన్యాన్ని అమ్మి మోసపోవద్దు

- Advertisement -

వరి ధాన్యం కోనుగులు కేంద్రాలను ప్రారంభించిన  ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య 
నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్

రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటను దళారులకు అమ్మి మోసపోవద్దని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. శుక్రవారం, యాదగిరిగుట్ట మండలం గౌరయిపల్లి, మాసాయిపేట, సైదాపూర్, మల్లాపూర్ గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రైతులు వడ్ల కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ప్రభుత్వం రైతులకు అన్ని విధాలు అండగా ఉంటుందని అన్నారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ విధానమని అన్నారు.  మహిళా సంఘాల ద్వారా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు.  ఈ కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ చైతన్య రెడ్డి, మాజీ సర్పంచ్ బీర్ల శంకర్, మండల పార్టీ అధ్యక్షులు మంగ సత్యనారాయణ, మండల నాయకులు దుంబాల వెంకటరెడ్డి, మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ యేమాల ఏలేందర్ రెడ్డి, మండల నాయకులు కళ్లెం జాంగిర్ గౌడ్, భూషల్ల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -