– ర్యాగింగ్ కు పాల్పడి జీవితాలు నాశనం చేసుకోవద్దు
– హుస్నాబాద్ ఎస్ఐ మణెమ్మ
నవతెలంగాణ హుస్నాబాద్ రూరల్
విద్యార్థులు తెలిసి తెలియని వయసులో ప్రేమ పెళ్లి అంటూ మోసపోవద్దని, చదువులో రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని హుస్నాబాద్ ఏ ఎస్ ఐ మన్నెమ్మ అన్నారు. మంగళవారం హుస్నాబాద్ మండలంలోని గాంధీనగర్ లోని శాతవాహన ఇంజనీరింగ్ కాలేజ్ లో విద్యార్థిని, విద్యార్థులకు యాంటీ హ్యుమన్ ట్రాఫికింగ్ ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, మానవ అక్రమ రవాణా, గుడ్ టచ్, బాడ్ టచ్,సైబర్ నేరాల పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏ ఎస్ ఐ మణెమ్మ మాట్లాడుతూ ర్యాగింగ్ కు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ర్యాగింగ్ కు పాల్పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని సూచించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. విద్యార్థినీ విద్యార్థులను ఉన్నతంగా నిలిపేది చదువు ఒక్కటేనని అన్నారు. అందరు కలిసిమెలిసి ఉండాలని ఒకరికొకరు చదువులో సహాయం చేసుకుంటూ ఒక లక్ష్యం, గోల్ ఏర్పాటు చేసుకోవాలన్నారు.విద్యార్థులను ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ చేసిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మహిళలు యువతులు ఎలాంటి సమస్య ఉన్న నిర్భయంగా షీటీమ్ నెంబర్ 8712667434 కాల్ చేయాలని సూచించారు. మహిళల రక్షణకు ఎల్లప్పుడు షీటీమ్ అండగా ఉంటుందని తెలిపారు. అపరిచిత వ్యక్తులను నమ్మవద్దని ఈ వయసులో ప్రేమ పెళ్లి అంటూ చెప్పే వారి మాటలు నమ్మవద్దని సూచించారు. తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తెరిగి చదువుకోవాలని మనిషి జీవితాన్ని మార్చేది చదువు ఒక్కటేనని చదువు ఉంటే ఎక్కడైనా బతుకవచ్చని తెలిపారు. ఇష్టపడి చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాలేజ్ ప్రిన్సిపల్ మోహన్ , షీటీమ్ బృందం సదయ్య ఏఎస్ఐ, మహిళ కానిస్టేబుల్ ప్రశాంతి, కానిస్టేబుల్ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.



