Sunday, December 28, 2025
E-PAPER
Homeమానవిఅత్యాశ వద్దు

అత్యాశ వద్దు

- Advertisement -

పియ్రమైన వేణు గీతికకు
నాన్న అందరం కలిసి సరదాగా గడిపాము. నువ్వు మాతో పాటు హైదరాబాద్‌ వచ్చినందుకు, కొన్నాళ్ళు ఇక్కడ ఉంటునందుకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు ఉంటేనే ఇల్లు సందడిగా ఉంటుంది.
నీకు గత కొన్ని రోజులుగా సైబర్‌ క్రైమ్‌ గురించి, జరుగుతున్న మోసాల గురించి చెప్తూ వచ్చాను. ఇది కూడా అటువంటి కోవలోకే వస్తుంది. మనిషి త్వరగా డబ్బు సంపాదించడం కోసం ఎలాంటి తప్పులు చేస్తాడో చెప్తాను. బెట్టింగ్‌ గురించి మనం వింటూనే వున్నాము. ఇప్పుడు ఇలాంటి యాప్స్‌ కూడా వచ్చాయి. బెట్టింగ్‌ అంటే పందెం కాయడం. పేకాట, గుర్రపు పందాలు, క్రికెట్‌, కేసినో.. ఇవన్నీ డబ్బులు పెట్టి ఆడతారు. దీనికి ఇంకొక పేరే జూదం. ఓడిపోతే డబ్బులు పోతాయి. గెలిస్తే డబ్బులు బాగా వస్తాయి. ఒక సారి డబ్బులు వచ్చాయి కదా అని మళ్ళీ మళ్ళీ పందెం కాస్తూనే ఉంటారు. దీనికోసం అప్పులు చేయడం అవి తీర్చలేక అనేక సమస్యలు ఎదుర్కోవడం జరుగుతూనే ఉంటుంది.

ఒక విధంగా ఇది వ్యసనం అని చెప్పవచ్చు. ఎదుటి వారు ప్రలోభాలకు లొంగే వరకు మీకు ఆశ పెడుతూనే ఉంటారు. ఈరోజే పేపర్లో చూసాను.. ఒకబ్బాయి బెట్టింగ్‌ యాప్‌ ద్వారా లక్షకు పైగా డబ్బు పోగొట్టుకున్నాడు. తల్లి తండ్రులు కొప్పాడతారనే భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు. మనిషి ఆశ జీవి అంటారు. కానీ ఇటువంటి వాటిలో మాత్రం ఆశ ఉండకూడదు. డబ్బు ఎప్పుడూ ఊరికే రాదు నాన్న. కష్టపడి సంపాదించాలి. మంచి మార్గంలో వెళ్ళాలి. అడ్డ దారులు తొక్కి డబ్బు సంపాదించాలనుకోవడమంటే మన నేర చరిత్రకు పునాది వేసుకుంటున్నట్లే. ఒక రోజు కాకపోతే మరొక రోజైనా చేసిన నేరం బయటకు వస్తుంది. అందుకే కష్టాలు ఎన్ని ఎదురైన ధైర్యంగా ఎదుర్కోవాలి. వాటినుండి బైట పడటానికి మంచి మార్గంలో ప్రయత్నించాలి. రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు.. ఉంటాను నాన్న.

ప్రేమతో అమ్మ
పాలపర్తి సంధ్యారాణి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -