Monday, March 23, 2026
E-PAPER
Homeఆటలునేను 60 ఏండ్ల వరకు ఆడినా ఆశ్చర్యపోవద్దు: ఎంఎస్ ధోనీ

నేను 60 ఏండ్ల వరకు ఆడినా ఆశ్చర్యపోవద్దు: ఎంఎస్ ధోనీ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: సీఎస్‌కే దిగ్గజ ఆటగాడు, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ తన రిటైర్మెంట్‌పై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అభిమానుల్లో ఉత్సాహం నింపారు. ఐపీఎల్‌లో 60 ఏళ్ల వయసు వచ్చినా ఆడుతూనే ఉంటానేమోనంటూ ఆయన చేసిన సరదా వ్యాఖ్యలు చెపాక్ స్టేడియాన్ని హోరెత్తించాయి. ప్రస్తుతం 44 ఏండ్ల వయసులో ఉన్న ధోనీ, తన భవిష్యత్తు ప్రణాళికలపై జరుగుతున్న ఊహాగానాలకు ఈ వ్యాఖ్యలతో మరింత ఆసక్తిని జోడించారు.

చెపాక్‌లో నిన్న‌ జరిగిన సీఎస్‌కే ఫ్యాన్ ఈవెంట్‌లో ఈ సరదా సంభాషణ చోటుచేసుకుంది. ఈ కార్యక్రమానికి హాజరైన నటుడు శివకార్తికేయన్, రిటైర్మెంట్ ఆలోచనలు పక్కనపెట్టి మరికొన్నేళ్లు సీఎస్‌కే పసుపు జెర్సీలో కొనసాగాలని ధోనీని కోరారు. దీనికి ధోనీ నవ్వుతూ బదులిస్తూ… “ప్రస్తుతం 44 ఏళ్ల వయసులో ఫిట్‌నెస్ కాపాడుకోవడం చాలా కష్టంగా ఉంది. అయినా కంగారు పడకండి… నేను 60 ఏండ్ల వరకు ఆడినా ఆశ్చర్యపోవద్దు” అని అన్నారు. ఈ మాటలకు స్టేడియంలోని అభిమానుల నుంచి భారీ స్పందన వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -