Saturday, November 1, 2025
E-PAPER
Homeమహబూబ్ నగర్బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని విద్యార్థులను ఇబ్బందులు పెట్టొద్దు

బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని విద్యార్థులను ఇబ్బందులు పెట్టొద్దు

- Advertisement -

నవతెలంగాణ-అచ్చంపేట
బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని ఉద్దేశంతో బెస్ట్ అవైలబుల్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను యాజమానులు ఇబ్బందులు పెట్టవద్దని నాగర్ కర్నూల్ జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అభివృద్ధి అధికారి ఉమాపతి సూచించారు శనివారం ఆయన నవతెలంగాణ తో మాట్లాడారు. నాగర్ కర్నూల్ ఎస్సీ సంక్షేమ శాఖ పరిధిలో 09 బెస్ట్ అవైలబుల్ పాఠశాలలు ఉన్నాయి. వివిధ గ్రామాలకు చెందిన 1062 మంది ఎస్సీ విద్యార్థులు హాస్టల్లో నివాసం ఉంటూ చదువుకుంటున్నారు. పెండింగ్ లో ఉన్న బిల్లులలో 25% బిల్లులు ఆయా బెస్ట్ అవైలబుల్ పాఠశాలల ఖాతాలో వారం రోజుల క్రితమే ప్రభుత్వం జమ చేయడం జరిగిందని గుర్తు చేశారు. మిగతా పెండింగ్ బిల్లులు త్వరలోనే ప్రభుత్వం చెల్లిస్తుందని జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి ఉమాపతి తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలని, బట్టలు, బూట్లు ఇతర సౌకర్యాలు కల్పించాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -