Monday, February 23, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఎవరి ఒత్తిళ్లకూ తలొంచం

ఎవరి ఒత్తిళ్లకూ తలొంచం

- Advertisement -

ఇరాన్‌ అధ్యక్షులు మసూద్‌ పెజెష్కియాన్‌
మధ్యధరా సముద్రంలోకి యూఎస్‌ఎస్‌ గెరాల్డ్‌ ఆర్‌ ఫోర్డ్‌

టెహ్రాన్‌ : ప్రపంచంలోని శక్తివంతమైన దేశాల ఒత్తిళ్లకు లొంగే ప్రశ్నే లేదని ఇరాన్‌ అధ్యక్షులు మసూద్‌ పెజెష్కియాన్‌ స్పష్టం చేశారు. ‘మమ్మల్ని తలవంచేలా ఒత్తిడి చేసేందుకు ప్రపంచంలోని శక్తివంతమైన దేశాలన్నీ వరుస కట్టాయి. అయితే వారు ఎన్ని ఇబ్బందులు కల్పించినా లొంగే ప్రశ్నే లేదు’ అని చెప్పారు. ఇరాన్‌పై పరిమిత చర్యకు పూనుకునే విషయాన్ని పరిశీలిస్తున్నానంటూ అమెరికా అధ్యక్షులు డోనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో పెజెష్కియన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

పది రోజులలో ఇరాన్‌ ఒప్పందానికి రాకుంటే పరిస్థితులు దారుణంగా ఉంటాయని ట్రంప్‌ బెదిరించారు. తర్వాత ఆయన ఆ గడువును పక్షం రోజులకు పెంచారు. ఇదిలావుండగా అమెరికాకు చెందిన యుద్ధ విమాన వాహక నౌక యూఎస్‌ఎస్‌ గెరాల్డ్‌ ఆర్‌ ఫోర్డ్‌ గిబ్రాల్టర్‌ జలసంధిని దాటి మధ్యధరా సముద్రంలో ప్రవేశించింది. ఇరాన్‌పై సైనిక పరమైన ఒత్తిడి పెంచేందుకు అమెరికా ఈ నౌకలను మధ్యప్రాచ్య జలాలలోకి పంపుతోంది. యూఎస్‌ఎస్‌ అబ్రహం లింకన్‌ను, దానికి రక్షణగా మరో యుద్ధ నౌకను అమెరికా గత నెలలోనే గల్ఫ్‌కు పంపింది. కాగా జెనీవాలో జరిగిన చర్చల పర్యవసానంగా ముసాయిదా ఒప్పందాన్ని అందజేసేందుకు ఇరు పక్షాలు అంగీకరించాయి. దీనిని రెండు మూడు రోజులలో ట్రంప్‌ ప్రత్యేక దూత స్టీవ్‌ విట్‌కాఫ్‌కు అందజేస్తారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -