– విద్యార్థులందరికీ పూర్తి రీయింబర్స్‌్‌మెంట్ ఇవ్వాలి
– లేదంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం : ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో పాలిటెక్నిక్ కోర్సు ఫీజులను 161 శాతం వరకు రాష్ట్ర ప్రభుత్వం పెంచి పేద విద్యార్థులపై ఫీజుల భారం మోపిందని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర కమిటీ విమర్శించింది. పెంచిన ఫీజులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. లేదంటే పాలిటెక్నిక్ విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పూర్తిగా చెల్లించాలని కోరింది. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించింది. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ రజినీకాంత్, కార్యదర్శి టి నాగరాజు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పాలిటెక్నిక్ ఫీజులను ఖరారు చేయలేదు కాబట్టే పాలిసెట్ ప్రవేశాల కౌన్సెలింగ్‌ను వాయిదా వేశామంటూ ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. తీరా సీట్లను కేటాయించి పాలిటెక్నిక్ కోర్సుల ఫీజులను పెంచడం సిగ్గుచేటని విమర్శించారు. రూ.14,900 ఉన్న ఫీజును ఏకంగా రూ.39 వేలకు అంటే 161 శాతం పెంచడం దుర్మార్గమని పేర్కొన్నారు. పాలిసెట్‌లో 80,949 మంది ఉత్తీర్ణత సాధించారనీ, వారిలో 20,811 మంది అభ్యర్థుల పాలిసెట్ కౌన్సెలింగ్‌కు హాజరై వెబ్‌ఆప్షన్లను నమోదు చేశారని తెలిపారు. రాష్ట్రంలో 115 పాలిటెక్నిక్ కాలేజీల్లో 28,996 సీట్లు అందుబాటులో ఉంటే, పాలిసెట్ కౌన్సెలింగ్‌లో 18,984 మందికి సీట్లు కేటాయించారని వివరించారు. ప్రభుత్వ స్కూళ్లు, గురుకులాల్లో చదివిన వారు, పాలిసెట్‌లో వెయ్యిలోపు ర్యాంకు వచ్చిన విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించిందని పేర్కొన్నారు. మిగిలిన విద్యార్థులపై ఫీజుల భారం మోపితే చదువులను ఎలా కొనసాగిస్తారని ప్రశ్నించారు. పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.70 కోట్లు ఏటా కేటాయిస్తే చదువులు కొనసాగుతాయని వివరించారు. ప్రజాప్రభుత్వమంటే ఫీజులను పెంచి విద్యార్థులపై భారాలు మోపడమేనా?అని ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయడం లేదని తెలిపారు. రాష్ట్రంలో సాంకేతిక విద్యను పేద పిల్లలకు అందుబాటులో లేకుండా చేసే కుట్రలను తప్పికొట్టాలని వారు పిలుపునిచ్చారు. పాలిటెక్నిక్ ఫీజులను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులందరికీ పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్ చెల్లించాలని కోరారు. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడతామని తెలిపారు.
పాలిటెక్నిక్ విద్యార్థుల పైఫీజుల భారం మోపొద్దు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES