Saturday, September 27, 2025
E-PAPER
Homeఆదిలాబాద్ ప్రమాదం జరిగేదాకా పట్టించుకోరా..

 ప్రమాదం జరిగేదాకా పట్టించుకోరా..

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం : జన్నారం మండలం సింగరాయపేటకు వెళ్లే ప్రధాన విద్యుత్ లైన్ స్తంభాలు వంగిపోయి ప్రమాదకరంగా మారాయని రైతు పోచయ్య వాపోయారు. గాలివాన వస్తే పడిపోయి ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. విద్యుత్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. స్తంభాలు కిందపడక ముందే సరిచేయాలని పేర్కొన్నారు. విద్యుత్ అధికారులు స్పందించి వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -