నవతెలంగాణ – పెద్దవంగర
అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు ఎవరు రావద్దని తొర్రూరు డీఎస్పీ కృష్ణ కిషోర్, జిల్లా సహకార అధికారి వెంకటేశ్వర్లు అన్నారు. మండలంలోని వడ్డెకొత్తపల్లి, గంట్లకుంట చెరువులను వారు వేరువేరుగా ఆదివారం సందర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలపై అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలు ఎవరు కూడా అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని, ప్రయాణాలు చేయకూడదని సూచించారు. వర్షాలతో, వరద ప్రవహించే ప్రదేశాలకు వెళ్లి ప్రమాదాలకు గురి కావద్దని తెలిపారు. ఉధృతంగా ప్రవహించే వాగులు, వంకలు దాటోద్దని, ప్రజలు ఎవరు కూడా చేపల వేటకు వెళ్లకూడదని సూచించారు. వారి వెంట తహశీల్దార్ వీరగంటి మహేందర్, ఎంపీడీవో వేణుమాధవ్, ఇరిగేషన్ శాఖ డీఈ పూర్ణచందర్, తొర్రూరు సీఐ గణేష్, పెద్దవంగర, తొర్రూరు ఎస్సై లు క్రాంతి కిరణ్, ఉపేందర్, ఏఈ లు దయాకర్, కవిత అన్నారు.
అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దు: డీఎస్పీ కృష్ణ కిషోర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES