నవతెలంగాణ – భువనగిరి
భువనగిరి పట్టణం ముద్దుపెల్లి రోడ్ లో ఉన్న యాదినేని చెరువు నుండి గొల్లగూడెంకు నీటిని తరలించేందుకు కాలువ లోతుగా తీయడం వల్ల చెరువులో నీరు ఉండదని వెంటనే కాలువ లోతుగా తీయవద్దని సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి మాదే కృష్ణ విజ్ఞప్తి చేశారు. చెరువును నీళ్లు లేకుండా చూస్తే మత్స్యకారులు ఉపాధి కోల్పోయే అవకాశం ఉందన్నారు. నీటిపారుదల ఇంజనీరింగ్ విభాగం ఈ కాలువను పరిశీలించి చెరువు అలుగు ఎంత ఉందో ఆ లెవెల్ తో కాల్వ నిర్మించాలన్నారు. యాదినేని చెరువు కింద పట్టణ పరిధిలో సాగు భూమి ఉందని ఆ రైతులకు నష్టం కలిగితే రైతులతో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు కూర వెంకటేష్, సీపీఐ(ఎం) నాయకులు వల్ల దాస్ అంజయ్య, దండుగిరి, కూర రాములు, మద్ది గణేష్ మద్ది నరసింహ, సాయి, సురేష్ రైతులు పాల్గొన్నారు.
యాదినేని చెరువు కాలువ లోతుగా తీయొద్దు: సీపీఐ(ఎం)
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES