నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పొట్ట కూటి కోసం చిరువ్యాపారాలు చేసుకుంటున్న పేదల బతుకుల కూల్చొద్దని డివైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్‌లోని బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య పార్కు పరిధిలో ఫుట్ పాత్‌పై ఉన్న దుకాణాలను హైడ్రా, జీహెచ్‌ఎంసీ అధికారులు ఎలాంటి ముందస్తు నోటీసులివ్వకుండా అక్రమ నిర్మాణాల పేరుతో చిరు వ్యాపారం చేసుకునే వారి దుకాణాలను ఆకారణంగా కూల్చివేయడ తగదని తెలిపారు. చిన్న చిన్న దుకాణాలను కూల్చేయటం మూలంగా చిరు వ్యాపారులకు తీవ్ర నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. చిరు వ్యాపారుల పొట్ట కొట్టే చర్యలను అదికారులు మానుకోవాలని హితవు పలికారు.
చిరు వ్యాపారం చేసుకుని బతికే పేదలపై హైడ్రాధికారుల ప్రతాపం మానుకోవాలని సూచించారు. ముందస్తు నోటీసులు, కనీస సమాచారం కూడా ఇవ్వకుండా దుకాణాలను కూల్చివేయడమేంటని ప్రశ్నించారు. దుకాణాల్లోని వస్తువులను సర్దుకునే అవకాశం కూడా ఇవ్వకుండా కూల్చివేయడం మూలంగా పేద వర్గాలైన వాళ్లు తీవ్రంగా ఇబ్బందులు పడడమే కాకుండా ఆర్థికంగా నష్టపోతున్నారని తెలిపారు. హైదరాబాదు నగరంలో బడాబాబులు అధికారుల అండదండలతో రోడ్లను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వారిపై చర్యలు చేపట్టకుండా, సామాన్య చిరు వ్యాపారులు, పేదలపై అధికారులు విరుచుకుపడడం తగదని పేర్కొన్నారు. రోడ్లు, ప్రభుత్వ భూములు, నాళాలు, చెరువులు, కుంటల భూములను ఆక్రమించే వారిని వదిలిపెట్టి, సామాన్యుల పైన పడటం మానుకోవాలనీ, వీధి వ్యాపారాలు చేసుకునే వారికి ప్రత్యేక మార్గాలు చూపాలని డిమాండ్ చేశారు.
పేదల బతుకులను కూల్చొద్దు : డివైఎఫ్‌ఐ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



