Wednesday, October 15, 2025
E-PAPER
Homeఆదిలాబాద్ధాన్యాన్ని రోడ్లపై ఆరబెట్టొద్దు: ఎస్ఐ కృష్ణరెడ్డి

ధాన్యాన్ని రోడ్లపై ఆరబెట్టొద్దు: ఎస్ఐ కృష్ణరెడ్డి

- Advertisement -

నవతెలంగాణ – కుభీర్
మండలంలోని ఆయా గ్రామాల రైతులకు సంబదించిన సొయా పంటలను రోడ్లపై ఉంచకూడదని కుభీర్ ఎస్ ఐ కృష్ణ రెడ్డి తెలిపారు. బుధువారం ఎస్ ఐ రైతులతో మాట్లాడుతూ.. గ్రామాల్లో ఉన్న రైతులు తమ సొయా పంటలను అరపెట్టేందుకు రోడ్లపై ఉంచకుండా తాగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దింతో వాహన దారులకు రాత్రి సమయంలో సొయా కుప్పలు కనిపించకపోవడంతో రోడ్డు ప్రమాధాలు జరిగే అవకాశలు ఉన్నాయాని తెలిపారు. దింతో మంగళవారం రాత్రి చాత గ్రామ శివరు ప్రాంతాల్లో ద్విచక్రా వాహనం అదుపు తప్పి మృతి చెందడం జరిగిందని రైతులకు తెలిపారు. ఎవరు కూడా సొయా పంటను రోడ్లపై వేయకూడదు అని అన్నారు. అదే విదంగా వాహనదారులు రాత్రి సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -