Monday, February 23, 2026
E-PAPER
Homeజాతీయండిజిటల్‌ మోసాల బారిన పడొద్దు

డిజిటల్‌ మోసాల బారిన పడొద్దు

- Advertisement -

బ్యాంకు ఖాతాల పాస్‌వర్డ్స్‌ తరుచూ మార్చండి : మన్‌ కీ బాత్‌లో ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : బ్యాంకు ఖాతాల పాస్‌వర్డ్‌లను తరుచూ మారుస్తుం డాలని దేశ ప్రజలకు ప్రధాని మోడీ సూచించారు. నో యువర్‌ కస్టమర్‌ (కేవైసీ)ని అప్‌డేట్‌ చేయమని, రీ-కేవైసీని చేయమని బ్యాంకు నుంచి వచ్చే రిక్వెస్టులను చూసి అస్సలు చిరాకు పడవద్దని ప్రజలను ఆయన కోరారు. సొంత డబ్బును కాపాడుకునేందుకే ఈ పనిని చేస్తున్నామనే విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు. ఆదివారం 131వ మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో మోడీ పలు కీలక అంశాలను ప్రస్తావించారు.

ఇప్పటికీ బ్యాంకు ఖాతా కేవైసీని చేశాం కదా, దీన్ని మళ్లీ మళ్లీ ఎందుకు చేయాలనే ప్రశ్న చాలామంది మదిలో ఉదయిస్తుంటుందని ప్రధాని అన్నారు. ‘మళ్లీమళ్లీ కేవైసీ ఎందుకంటే, బ్యాంకు ఖాతా భద్రత కోసమే’ అని అందరూ గ్రహించాలని ఆయన పిలుపునిచ్చారు. డిజిటల్‌ అరెస్టు లాంటి ఆన్‌లైన్‌ ఆర్థిక మోసాల బారినపడకుండా అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రజలకు సూచించారు. ఈ కాలంలో పెన్షన్‌, రాయితీలు, బీమా, యూపీఐ సహా అన్నీ బ్యాంకు ఖాతాతోనే లింకై ఉన్నాయని మోడీ గుర్తుచేశారు. అందుకే ఖాతాలకు మెరుగైన భద్రతను కల్పించేందుకు రీ కేవైసీని బ్యాంకులు చేయిస్తాయన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -