Wednesday, March 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్హంగూ ఆర్భాటాలకు పోయి అప్పుల పాలు కావద్దు: హౌసింగ్ ఏఈ హనుమంత్

హంగూ ఆర్భాటాలకు పోయి అప్పుల పాలు కావద్దు: హౌసింగ్ ఏఈ హనుమంత్

- Advertisement -

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల లబ్ధిదారులకు హౌసింగ్ ఏఈ సూచన

నవతెలంగాణ మద్నూర్

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల లబ్ధిదారులు ప్రభుత్వం నిబంధనల ప్రకారం సాధారణ రీతిలో ఇల్లు నిర్మించుకోవాలని వైఫైగా ఇండ్లు నిర్మాణాలు చేపట్టి అప్పుల పాలు కావద్దని హౌసింగ్ ఏఈ హనుమంత్ సూచించారు. బుధవారం నాడు హౌసింగ్ ఏఈ డోంగ్లి మండలంలోని ఎనబోరా గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం ఆయనను నవ తెలంగాణ విలేఖరి కలిసి మద్నూర్, డోంగ్లి మండలాల పరిధిలో మొత్తం ఇందిరమ్మ ఇండ్ల మంజూరు ఎంత ఇప్పటివరకు ఇండ్ల నిర్మాణాల శాతం ఏ విధంగా ఉంది అని వివరాలు అడిగి తెలుసుకోగా ఏఈ నవ తెలంగాణకు పూర్తి వివరాలు అందజేశారు.

మద్నూర్ మండలంలో మొత్తం 614 ఇండ్లు మంజూరైనట్లు వీటిలో 150 ఏండ్లు బేస్మెంట్ ఒక వంద ఆరు ఇండ్లు రూటు లెవెల్ 216 స్లాబ్ లెవెల్ 34 ఏళ్లు ఫినిషింగ్ అయినట్లు తెలియజేశారు. అదేవిధంగా డోంగ్లి మండలంలో 245 ఇల్లు మంజూరు కాగా వీటిలో బేస్మెంట్ లెవెల్ 75 ఇల్లు రూపు లెవెల్ 24 స్లాబ్ లెవెల్ 65 ఇండ్లు ఫినిషింగ్ అయినా ఈ 13 ఇండ్లు కొనసాగుతున్నట్లు వివరించారు. ఈ అర్చనాల ప్రకారం మద్నూర్ మండలంలో 82% డోంగ్లి మండలంలో 69 శాతం ఇండ్ల నిర్మాణాలు పూర్తయినట్లు హౌసింగ్ ఏఈ తెలియజేశారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల లబ్ధిదారులకు గ్రామ కార్యదర్శులు ఎనలేని సహాయ సహకారాలు అందించడం పట్లనే ఇందిరమ్మ ఇండ్లు మద్నూర్ డోంగ్లి మండలాల పరిధిలో చురుగ్గా ముందుకు కొనసాగుతున్నాయని ఏఈ కొనియాడారు. ఎనబొర గ్రామంలో ఇండ్ల నిర్మాణాల పరిశీలనలో ఆ గ్రామ కార్యదర్శి సురేష్ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -