Wednesday, April 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఐపీఎల్ బెట్టింగ్ జోలికి వెళ్లొద్దు: ఎస్ఐ సమత 

ఐపీఎల్ బెట్టింగ్ జోలికి వెళ్లొద్దు: ఎస్ఐ సమత 

- Advertisement -

నవతెలంగాణ –  మిరుదొడ్డి 
యువత ఐపీఎల్ బెట్టింగ్ జోలికి వెళ్లొద్దని  ఎస్ఐ  సమత అన్నారు. బుధవారం ఆమె  మాట్లాడుతూ ఐపీఎల్ క్రికెట్ సీజన్ పేరిట నిర్వహించే ఆన్లైన్ బెట్టింగ్ వల్ల డబ్బులు కోల్పోవడమే కాకుండా, క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. క్రీడలను వినోదంగా చూడాలి తప్ప, వ్యసనంగా మార్చుకోవద్దన్నారు. గ్రామాల్లో ఐపీఎల్ మ్యాచ్లను  డబ్బులు పెట్టి మ్యాచ్ గెలుపు ఓటమి వద్ద బెట్టింగ్ పెడితే తగు చర్యలు ఉంటాయన్నారు. ఎవరైనా యువకులు ఆన్లైన్ బెట్టింగ్ ఆడినట్లయితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎక్కడైన బెట్టింగ్ నిర్వహించినట్లు కనబడిన వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -