Saturday, July 5, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంటిబెట్‌ విషయంలో జోక్యం వద్దు!

టిబెట్‌ విషయంలో జోక్యం వద్దు!

- Advertisement -

భారత్‌కు చైనా సూచన
బీజింగ్‌ :
టిబెట్‌ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని చైనా, భారత్‌కు సూచించింది. టిబెట్‌ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడాన్ని నిలిపివేయాలని, అలాగే చైనాతో అభివృద్ధి సంబంధాలు దెబ్బతినకుండా చూడాలని ఆశిస్తు న్నట్లు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్‌ ఒక ప్రకటన జారీ చేశారు.
తన మాటలు, చేతల విషయంలో భారత్‌ అమ్రత్తతతో వ్యవహరించాలని ఆశిస్తున్నట్లు ఆ ప్రకటన పేర్కొంది. చైనా అంతర్గత వ్యవహారాల్లో, అలాగే జియాంగ్‌ (టిబెట్‌) సంబంధిత అంశాల్లో జోక్యం చేసుకోవద్దని కోరింది. తద్వారా చైనా-భారత్‌ సంబంధాల మెరుగుదలపై, అభివృద్ధిపై ఎలాంటి ప్రభావం పడకుండా చూసుకోవాలని సూచించింది. భారత్‌ మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు చేసిన వ్యాఖ్యలకు చైనా అభ్యంతరం తెలియచేసింది. రిజిజు వ్యాఖ్యలపై మీడియా అడిగిన ప్రశ్నకు మావో నింగ్‌ పై రీతిన స్పందించారు. దలైలామా వారసుడి ఎంపిక ఆయన ఆకాంక్షలకు తగినట్లుగానే సాగుతుందని మంత్రి రిజిజు వ్యాఖ్యానించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -