నవతెలంగాణ – ఆలేరు
విలువైన వస్తువులను బంగారం డబ్బులు ఇంట్లో ఉంచుకోవద్దని బ్యాంకుల్లో లాకర్లలో పెట్టి దొంగల బారి నుండి రక్షణ పొందాలని ఆలేరు సీఐ యాలాద్రి అన్నారు. బుధవారం ఆలేరు పట్టణంలోని బృందావన కాలనీలో ఇంటి యజమానులోని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ .. బంగారం ధర విపరీతంగా పెరిగిందని దొంగతనాలు అక్కడక్కడ జరుగుతున్నాయి. ముందు జాగ్రత్త మేలని పేర్కొన్నారు.బృందావన్ కాలనీ కూడా జరిగే అవకాశాలు ఉన్నందున అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. కాలనీ వాసులు అందరూ కలిసి సీసీ కెమెరాల ఏర్పాటు చేసుకుంటే మంచిదని అభిప్రాయపడ్డారు. కాలనీలో కొత్తవారు తిరిగినప్పుడు ప్రశ్నించాలని అన్నారు. అనుమానం వస్తే వెంటనే పోలీస్ స్టేషన్ కాల్ చేయాలని చెప్పారు. దసరా పండుగ రావడంతో ఇండ్లకు తాళాలు వేసి ఇతర గ్రామాలకు వెళ్లడం వల్ల దొంగతనాలు జరిగే అవకాశం ఉంది. ఇంట్లో ఎప్పుడూ ఒకరు ఉండే విధంగా చూసుకోవాలని చెప్పారు వీరితోపాటు ఎస్సై వినోద్ కుమార్ కానిస్టేబుళ్లు కాలనీ వాసులు పాల్గొన్నారు.
విలువైన వస్తువులను ఇంట్లో ఉంచుకోవద్దు : యాదాద్రి సీఐ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES