జిల్లా కలెక్టర్, జెన్కో చెల్పూర్ సిఈలకు నిర్వాసితుల వినతి
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల ఓసీపీకి డేంజర్ జోన్లో ఉన్న ఇండ్లను లీజుకు ఇవ్వం సేకరించి ఇండ్లకు భూములకు పరిహారం, ఆర్అండ్ఆర్ ప్యాకేజి, పునరావాసం కల్పించాలని తాడిచెర్ల, కాపురం భూ నిర్వాసితులు, నిరుద్యోగుల సంఘం అధ్యక్షుడు ముడుతానపల్లి ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి చింతల కుమార్ యాదవ్, కోశాధికారి చొప్పరి రాజయ్య మంగళవారం భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ,టిఎస్ జెన్కో సిఈఓ కు విరివిరిగా వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ ఇండ్లను లీజుకు ఇవ్వమని, సేకరించి పరిహారం, ప్యాకేజి, పునరావాసం ఇవ్వాలన్నారు. బొగ్గు తవ్వకాల్లో గుంట నుంచి ఎకరం వరకు భూములు కోల్పోయిన నిర్వాసితులకు ఉపాధి కల్పించాలని కోరారు.
ఇండ్లను లీజుకు ఇవ్వం.. సేకరించి పరిహారం ఇవ్వండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



