నవతెలంగాణ – జుక్కల్
ప్రకృతి ప్రసాదించిన పంచభూతాలతో ప్రజలు చెలగాటమాడవద్దని జుక్కల్ ఎస్సై నవీన్ చంద్ర ఉధ్బోదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల నాలుగు రోజులుగా కురిసిన వర్షం వలన ప్రకృతి విలయతాండవం చేసిందని అన్నారు. మండలంతో పాటు జిల్లాలు, రాష్ట్రంలోని జనజీవనం స్తంభించిపోయే విధంగా ప్రకృతి ప్రకోపించిందని తెలిపారు. అందుకే ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని, పరిశుభ్రతను కాపాడుకోవాలని, ప్రతి ఒక్కరిపై బాధ్యత ఉందని ఆయన అన్నారు.
అదేవిధంగా మండల ప్రజలకు పలు సూచనలు చేశారు. ప్రవహిస్తున్న వాగులు దాటేయత్నం చేయవద్దని అన్నారు. ఇంత అర్జెంట్ అయిన వాగులో సాహసం చేయకండి అని సూచించారు. వాగుల దగ్గర రీల్స్ , సెల్ఫీల కోసం ప్రయత్నించవద్దని ఉన్నారు. తడిచిన చేతులతో స్విచ్ బోర్డు, విద్యుత్ పరికరాలు ముట్టుకోవద్దని చెప్పారు. చిన్నారులు విద్యుత్ పరికరాల వద్ద వెళ్లకుండా చూసుకోవాలని తల్లి దండ్రులకు సూచించారు. మీరు నిలిచి ఉన్నచోట వాహనాలు నెమ్మదిగా నడపండి అని, నెమ్మదిగా తీసుకువెళ్లాలని చెప్పారు. కరెంట్ పోల్స్, విద్యుత్తు నియంత్రికలకు ముట్టుకోవద్దని, వెళ్లొద్దని తెలిపారు. అత్యవసరమైతేనే ప్రయాణాలు చేయండి అని సూచించారు. వెదర్ అప్డేట్ ను ఎప్పటికప్పుడు ఫాలో కావాలని పేర్కొన్నారు.
పంచభూతాలతో చెలగాటమాడొద్దు: ఎస్సై నవీన్ చంద్ర
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES