Wednesday, February 25, 2026
E-PAPER
Homeజాతీయంనాతో ఆటలాడొద్దు

నాతో ఆటలాడొద్దు

- Advertisement -

భాగస్వామ్యపక్షాలకు ట్రంప్‌ బెదిరింపులు…
– భారత్‌పైనే గురి
– వాణిజ్య చర్చలు వాయిదా పడడమే కారణం
– ప్రపంచ మార్కెట్లలో ఉద్రికత్తలు

సుప్రీంకోర్టు తీర్పును ఆసరాగా చేసుకొని తనతో ఆటలాడాలని అనుకునే దేశాలు… ముఖ్యంగా సంవత్సరాలుగా అమెరికాను కొల్లగొట్టిన దేశాలు ఇటీవల అంగీకరించిన సుంకాల కంటే ఎక్కువ సుంకాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రంప్‌ సోమవారం సాయంత్రం తన ట్రూత్‌ సోషల్‌లో బెదిరింపులకు దిగారు. ఈ బెదిరింపు భారత్‌ను ఉద్దేశించి చేసిందేనని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అమెరికాకు వాణిజ్య ప్రతినిధి బృందాన్ని పంపడం వాయిదా పడినప్పటికీ ప్రతిపాదిత ఒప్పందం నుంచి వైదొలగడం లేదని అధికారులు తెలిపారు. అయితే భారత్‌ ఇన్ని రోజులూ అధిక సుంకాలు విధించి వాణిజ్య దోపిడీకి పాల్పడిందని గతంలో ట్రంప్‌ ఆరోపణలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన రోజున కూడా ఆయన ఇవే మాటలు అన్నారు. అయితే సుప్రీంకోర్టు తీర్పు భారత్‌పై ఎలాంటి ప్రభావం చూపదని, మధ్యంతర వాణిజ్య ఒప్పందంలో అంగీకరించిన విధంగా 18 శాతం సుంకాలు కొనసాగుతాయని ఆయన ఆ తర్వాత చెప్పుకొచ్చారు.

న్యూఢిల్లీ : వాణిజ్య భాగస్వామ్య దేశాలపై తాను విధించిన సుంకాలను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో కంగు తిన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా ఆయా దేశాలకు హెచ్చరిక జారీ చేశారు. సుప్రీంకోర్టు తీర్పును సాకుగా చూపించి వాణిజ్య హామీల నుంచి వెనక్కి తగ్గితే ఊరు కునేది లేదని అంటూ తనతో ఆటలా డాలని చూడవద్దని, అలా చేస్తే భారీగా సుంకాలు వడ్డిస్తానని బెది రించారు. అమెరికాలో తన వాణిజ్య బృందం పర్యటనను భారత్‌ వాయిదా వేసుకున్న గంటల వ్యవధిలోనే ఈ హెచ్చరిక జారీ కావ డాన్ని గమనిస్తే ఆయన మన దేశాన్నే లక్ష్యంగా చేసుకున్నారన్న సందేహం కలగక మానదు.

బేరసారాలకు అవకాశం
ఏదేమైనా ట్రంప్‌ తాజా బెదిరింపు భారత్‌ను ఉద్దేశించి చేసిందేనని అర్థమవు తోందని వాణిజ్య శాఖ మాజీ కార్యదర్శి కన్వల్‌ సిబల్‌ చెప్పారు. భారత్‌ను ఉద్దేశించే ఆయన ‘దోపిడీ’ అనే పదాన్ని ఉపయో గించారని తెలిపారు. కాగా ట్రంప్‌ ప్రభుత్వం బలహీన పడిందని, దాని నుంచి ప్రయో జనం పొందాలని కొన్ని దేశాలు ప్రయత్నిస్తాయని మాజీ ఆర్థిక సలహా దారు అరవింద్‌ సుబ్రమణియన్‌ అన్నారు. భారత్‌కు సంబంధించినంత వరకూ గతంలో అంగీకరించిన 18 శాతం సుంకాలతో పోలిస్తే తాజాగా విధించిన 15 శాతం సుంకాలు ఊరట కలిగించేవే. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో సుంకాలపై భారత్‌ బేరసారాలకు దిగేందుకు, మరిన్ని సానుకూల నిర్ణయాలు పొందేందుకు అవకాశం కలిగింది
.
వాణిజ్య బృందం పర్యటన వాయిదా
సుప్రీంకోర్టు తీర్పు ట్రంప్‌లో కోపాన్ని, బాధను కలిగిస్తోంది. తనకు ఎంతో ఇష్టమైన సుంకాలను విధించే సామర్ధ్యాన్ని న్యాయ స్థానం బలహీనపరచింది. అదే సమ యంలో ఆయన వాణిజ్య పరపతి తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో కొంత కఠిన వైఖరి అవలం బించాలని ట్రంప్‌ భావిం చారు. సుప్రీంకోర్టు తీర్పును ఆసరాగా చేసుకొని తనతో ఆటలాడవద్దని వాణిజ్య భాగస్వా ములను హెచ్చరించారు. అయితే ఆయన ఏ దేశం పేరునూ ఉదహరిం చనప్పటికీ భారత్‌నే లక్ష్యంగా చేసు కున్నారని అర్థమవుతోంది. ఎందుకంటే వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసు కోవడానికి మన ప్రతినిధి బృందం అమెరి కాలో పర్యటించాల్సి ఉంది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆ పర్యటనను వాయిదా వేసింది. ఆ తర్వాత కొద్ది గంటలకే ట్రంప్‌ ప్రకటన వెలువడింది.

పునరాలోచనలో వాణిజ్య భాగస్వాములు
ప్రపంచ దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ట్రంప్‌ సుంకాలనే అస్త్రాలుగా ఉపయోగించుకుంటున్న విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పుతో ఆ అస్త్రాలకు విలువ లేకుండా పోయింది. అయినప్పటికీ అమెరికాకు దిగుమతి అయ్యే అన్ని వస్తువులపై పది శాతం సుంకాలు విధించబోతున్నట్లు ఆయన ప్రకటించారు. ఆ తర్వాత ఆ సుంకాలను పదిహేను శాతానికి పెంచారు. అయితే సుంకాల భయం, ఒత్తిడితో అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు చేసుకున్న దేశాలు ఇప్పుడు పునరాలోచనలో పడుతున్నాయి. ఈ విషయం ట్రంప్‌కు తెలియంది కాదు. ఎందుకంటే ట్రంప్‌ తాజాగా విధించిన సుంకాలు 150 రోజులు మాత్రమే అమలులో ఉంటాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -