Friday, October 10, 2025
E-PAPER
Homeకరీంనగర్వ్యక్తి గత ఫొటోలు సోషల్ మీడియాలో పెట్టొద్దు: సిఐ

వ్యక్తి గత ఫొటోలు సోషల్ మీడియాలో పెట్టొద్దు: సిఐ

- Advertisement -

యువతిని వేదించిన కేసులో అనంత పల్లికి చెందిన వేణు అరెస్టు
తెలంగాణ – చందుర్తి
ఓ యువతిని సోషల్ మీడియాలో వేధించిన ఘటనలో అనంత పల్లి కి చెందిన ఓ యువకున్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్లు గా సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. సిఐ తెలిపిన వివరాల ప్రకారం.. అనంత పల్లి గ్రామానికి చెందిన సలేంద్ర వేణు అతని స్నేహితుడు అదే గ్రామానికి చెందిన పోలె ప్రశాంత్ వద్ద ఫోన్లో ఉన్నఓ యువతి ఫొటోలు తీసుకుని ఫెక్ ఐడి సృష్టించి ఆ యువతి కి షేర్ చేస్తూ నువ్వు నాకు రూ.50 వేలు ఇవ్వాలి లేదంటే ఇన్స్త్రాగ్రాం లో నీ ఫొటోలు పెట్టి వైరల్ చేస్తానని బెదిరించాడు. దీంతో ఆ యువతి షీ టీమ్ ను, చందుర్తి పోలీసులను ఆశ్రయించింది.దీంతో ఆధునిక పరిజ్ఞానం తో పోలీసులు యువకుని ఐడి ని సేకరించగా అనంత పల్లి గ్రామానికి చెందిన సకేంద్ర వేణు అని తేలడంతో శుక్రవారం ఎస్సై రమేష్ సిబ్బంది తో కలసి ఉదయం అతని ఇంటి వద్ద అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి రిమాండ్ తరలించినట్లు గా తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -