కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు విప్ ఆదిశ్రీనివాస్ సవాల్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర మంత్రులంతా అవినీతికి పాల్పడుతుంటే వారికి కొందరు ఐఏఎస్‌లు సహకరిస్తున్నారంటూ బట్టగాల్సి మీద వేయడం సరిగాదనీ, దమ్ముంటే, ఆధారాలతో చూపెట్టాలని కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్‌కు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సవాల్ విసిరారు. గతంలో కూడా అనేక సార్లు ఇలానే మాట్లాడి ఆ తర్వాత కనిపించకుండా పోయారని విమర్శించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
కరీంనగర్ కార్పొరేషన్‌లో అటూఇటూ కాకుండా గెలిచిన సంజయ్ హడావిడి చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర మంత్రి హోదాలో ఉండి నోటికొచ్చినట్లు మాట్లాడటం సరిగాదని హితవు పలికారు. రాష్ట్రాన్ని దోచుకుని అప్పుల పాలు చేసిన కల్వకుంట్ల కుటుంబం పైన విచారణ కు ఆదేశిస్తే బీజేపీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్ అక్రమాలను బయటకు తీసి విచారణ కోసం సీబీఐకి పంపితే ఇంత వరకు ఎందుకు విచారణ మొదలు పెట్టడం లేదు? కాళేశ్వరం అవినీతిపైన సీబీఐ విచారణ ఎందుకు ప్రారంభించలేదు? అని నిలదీశారు.
బట్టగాల్చి మీద వేయొద్దు..ఆధారాలుంటే చూపెట్టు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



