– హనుమకొండలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ధర్నా
నవతెలంగాణ-వరంగల్
ఓరుగల్లు నగరంలో కూలగొట్టిన చిరు వ్యాపారుల దుకాణాలను పునర్నిర్మించే వరకు పోరాడుతామని, అందగత్తెల కోసం చిరు వ్యాపారుల జీవితాలను ఆగం చేయొద్దని మాజీ చీఫ్ విప్, బీఆర్‌ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినరుభాస్కర్ అన్నారు. చిరు వ్యాపారుల వ్యాపార సముదాయాలను కూల్చినందుకు నిరసనగా పేదల పక్షాన బుధవారం వరంగల్ మహానగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయం ఎదుట బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వినరు భాస్కర్ మాట్లాడుతూ.. చిరు వ్యాపారుల చట్టం ప్రకారం వాళ్లకి హక్కులు, రక్షణ కల్పించాలని, కేటీఆర్ హయాంలో ఓరుగల్లు పట్టణంలో వీధి వ్యాపారుల కోసం వెండింగ్ జోన్లు ఏర్పాటు చేశామన్నారు. ఓరుగల్లు చరిత్రను విశ్వవ్యాప్తం చేయడానికి తాము వ్యతిరేకం కాదని తెలిపారు. అందగత్తెలు వస్తున్నారని అమాయకుల జీవితాలను ఆగం చేయొద్దని కోరుతున్నామన్నారు. పండ్ల వ్యాపారులు, చారు డబ్బాలు, పాన్ షాపులు ఇలా చిన్నచిన్న ఉపాధి కార్మికుల జీవితాలను ఆగం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ డిప్యూటీ మేయర్ రిజ్వానా మసూద్, కార్పొరేటర్లు మరుపల్లి రవి, ఇండ్ల నాగేశ్వరరావు, సిద్ధం రాజు, చెన్నం మధు, సంకు నర్సింగ్, సోదా కిరణ్, ఇమ్మడి లోహితా రాజు, మాజీ కార్పొరేటర్లు జోరిక రమేష్, ఉడుతల సారంగపాణి, మేకల బాబురావు, తండమల్ల వేణు, పశ్చిమ నియోజకవర్గ కో ఆర్డినేటర్ పులి రజినీకాంత్, నాయకులు, చిరు వ్యాపారులు పాల్గొన్నారు.
అందగత్తెల కోసం చిరు వ్యాపారుల బతుకులు ఆగం చేయొద్దు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES