Saturday, December 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వరి వ్యర్థాలకు నిప్పు పెట్టవద్దు: ఏఓ పూర్ణిమ

వరి వ్యర్థాలకు నిప్పు పెట్టవద్దు: ఏఓ పూర్ణిమ

- Advertisement -

నవతెలంగాణ – కాటారం
రైతులు వరి పంటలలో వ్యర్థాలకు నిప్పు పెట్టడం వల్ల భూసారం తగ్గి, వాయు కాలుష్యం పెరుగుతుందని వ్యవసాయ శాఖ అధికారిని పూర్ణిమ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… వరి పంట కోసిన తర్వాత వరి కొయ్య కాలుకు నిప్పు పెట్టడం వలన పంటకు ఉపయోగపడే సూక్ష్మజీవులు నశిస్తాయి. పంటకు అందే పోషకాలు నశించి, పంట దిగుబడి తగ్గుతుందని రైతులకు సూచించారు. రైతులు తమ పంట భూముల్లో నిప్పు పెట్టకుండా భూమిలోనే కలియదున్ని భూసారాన్ని కాపాడుకోవాలని రైతులకు తెలిపారు. రైతులు అధిక వ్యవసాయ సమాచారం కోసం మొబైల్ సేవలను వినియోగించుకోవాలని తెలియజేశారు. సాగు చేసే పంటలు ,పండ్ల తోటల లకు సంబంధించి తీసుకోవలసిన సస్యరక్షణ చర్యల గురించి అధికారులను సంప్రదించాలని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -