– సమ్మెలకు పోతే రెండు వైపులా నష్టం : ఫిల్మ్ ఇండిస్టీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సభ్యులతో సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సినీ పరిశ్రమలో పని వాతావరణాన్ని చెడగొట్టుకోవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. సమ్మెలకు పోతే ఇటు ఇండిస్టీకి, అటు కార్మికులకు… ఇలా రెండు వైపులా నష్టమని ఆయన హితవు పలికారు. బుధవారం హైదరాబాద్‌లోని సీఎం నివాసంలో తెలుగు ఫిల్మ్ ఇండిస్టీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సభ్యులు ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. హైదరాబాద్‌ను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లేం దుకు తమ ప్రభుత్వం ప్రయత్ని స్తోందని అన్నారు. తమ వైపు నుంచి ఏం కావాలనే విషయంపై చర్చించుకుని రావాలని సినీ కార్మికులకు సూచించారు. వారిని విస్మరిం చొద్దంటూ నిర్మాతలకు విజ్ఞప్తి చేశారు. కార్మికు ల్లో నైపుణ్యాల పెంపునకు సహకరిం చాలని కోరారు. ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే స్కిల్ యూనివర్సిటీలో సినీ కార్మికులకు శిక్షణిస్తామని తెలిపారు. వారు కూడా తమ నైపుణ్యాలను పెంచుకోవాలని సూచించారు. తద్వారా అన్ని భాషల చిత్రాల షూటింగ్‌లు తెలంగాణలో జరిగేలా సహకరించాలని అన్నారు. అదే సమయంలో చిన్న సినిమా నిర్మాతలను ఆదుకోవాలని కోరారు. తాను సమస్యను సమస్యగానే చూస్తాననీ, వ్యక్తిగత అంశాలను పట్టించుకోబోనని సీఎం ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. సినీ కార్మికుల తరుపున నిర్మాతలతో ప్రభుత్వం చర్చలు జరుపుతుందని హామీనిచ్చారు. ‘ఈ ప్రభుత్వం మీది.. మీ సమస్యలను పరిష్కరించే బాధ్యత నాది…’ అని సీఎం భరోసానిచ్చారు. తాను ఎప్పుడైనా కార్మికుల వైపే ఉంటాననీ, అదే సమయంలో తనకు రాష్ట్ర ప్రయోజనాలు కూడా ముఖ్యమని అన్నారు. సమ్మె జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేమని చెప్పారు. సినీ కార్మికులకు వైద్య బీమా సౌకర్యాన్ని కల్పించేం దుకు ప్రయత్ని స్తామని హామీనిచ్చారు. సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మెన్ దిల్ రాజు,తెలుగు సినీ పరిశ్రమ ఎంప్లా యిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేని,ప్రధాన కార్యదర్శి అమ్మిరాజు కానుమిల్లి, వివిధ సినీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
పరిశ్రమలో పని వాతావరణాన్ని చెడగొట్టొద్దు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES