సెల్ ఫోన్ డ్రైవింగ్, మద్యం మత్తులో డ్రైవింగ్ ప్రమాదకరం
కాటారం డి ఎస్పీ సూర్యనారాయణ
నవతెలంగాణ – కాటారం
రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా కాటారం మండల కేంద్రంలో బుధవారం సాయంత్రం భారీ వాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ సూర్యనారాయణ మాట్లాడుతూ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. మైనర్లకు వాహనాలు అప్పగించవద్దని, హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రాణ నష్టం సంభవిస్తుందని హెచ్చరించారు. రహదారి నియమాలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ముఖ్య కూడళ్లలో వాహనాలను అడ్డంగా నిలిపితే చర్యలు తప్పవని తెలిపారు.
ప్రజలు స్వచ్ఛందంగా భద్రతా నియమాలు పాటిస్తూ ప్రమాదాల నివారణకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో కాటారం సీఐ నాగార్జునరావు, ఎస్సై శ్రీనివాస్, ఎంవీఐలు సుందర్లాల్, శ్రీనివాస్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు
హెల్మెట్ ధరించని ప్రయాణం వద్దు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



