Saturday, August 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సోషల్ మీడియాలో ఎవరిని నమ్మవద్దు: ఎస్పీ రాజేష్ చంద్ర  

సోషల్ మీడియాలో ఎవరిని నమ్మవద్దు: ఎస్పీ రాజేష్ చంద్ర  

- Advertisement -

– వారు రమ్మన్న చోటికి రమ్మంటే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి 
నవతెలంగాణ – కామారెడ్డి

సోషల్ మీడియా వేదికగా అమాయకులను లక్ష్యంగా చేసుకొని వారి వద్ద నుండి భారీగా డబ్బులు దోచుకుంటున్న ముఠాను  అరెస్ట్ చేసి తొమ్మిది కేసులను ఛేదించినట్లు జిల్లా ఎస్పీ యం, రాజేష్ చంద్ర అన్నారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో సోషల్ మీడియా యాప్‌లను ఉపయోగించి అమాయకులను మోసపూరితంగా వలలో వేసి, బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసి మొత్తం తొమ్మిది కేసులను ఛేదించడం జరిగిందన్నారు.

ఒక భాదితుని నుండి వచ్చిన ఫిర్యాదు మేరకు మొదటి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.  కొంత మంది వ్యక్తులు ఒక గ్రూప్ గా ఏర్పడి సోషల్ మీడియా యాప్‌ ల ద్వారా అమాయకులను పరిచయం చేసుకొని, కామారెడ్డి పట్టణంలోని మేఘా కార్ షెడ్ వద్దకు పిలిపించి, అక్కడ ఫోటోలను తీసి, వాటిని అసబ్యాకరముగా మార్చి వాటిని కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, సోషల్ మీడియా లలో వైరల్ చేస్తామని బయబ్రంతులకు గురి చేసి, వారి వద్ద నుండి ఫోన్ పే ద్వారా బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లుగా తెలిసిందన్నారు. ఈ కేసు నమోదుకు సంబంధించిన వివరాలను తెలుసుకున్న కొంత మంది భాదితులు ఇదే విధంగా మోసపోయినట్లు ఫిర్యాదులు ఇవ్వగా, ప్రస్తుతం 9 కేసులు నమోదయ్యాయి,  కామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధి: 6 కేసులు, తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్ పరిధి  2 కేసులు, నిజామాబాద్ I టౌన్ పోలీస్ స్టేషన్  1 కేసు నమోదు చేయడం జరిగిందన్నారు.

 ఈ  విషయాన్ని తనకు తెలిపగా తను కామారెడ్డి ఏ ఎస్ పి చైతన్య,  ప్రత్యక్త్య పర్యవేక్షణలో కామారెడ్డి పట్టణ ఎస్ హెచ్ ఓ నరహరి, సీసీఎస్ ఇన్స్పెక్టర్ ,  పట్టణ ఎస్సై లు ఇన్వెస్టిగేషన్ ప్రారంబించి అట్టి బాదితులు వద్ద నుండి  ఫోన్ పే చేపించుకున్న ఫోన్ నెంబర్లు పరిశీలించి, సి డి ఆర్ లో అనాలసిస్ చేసి ఇట్టి నేరాలు చేసిన నేరస్తులను గుర్తించడం జరిగిందన్నారు.  అట్టి వ్యక్తుల కోసం వెతుకుతుండగా, అట్టి వ్యక్తులు శనివారం ఉదయం రైల్వే స్టేషన్ లో ఉండి ఎక్కడికో వెలుతున్నారని సమాచారం మేరకు,  రైల్వే స్టేషన్ వెళ్లి అక్కడ వారిని గుర్తించి పట్టుకొని విచారించగా మొత్తం ఐదుగురు వ్యక్తులు ఇట్టి నేరాలు చేసినట్లు వారు ఒప్పుకున్నారన్నారు.  కామారెడ్డి ఓల్డ్ బస్టాండ్ కు చెందిన  షేక్ జోహేబ్ , సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మండలం చందంపేట గ్రామానికి చెందిన  షేక్ సోహెల్ ,  కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని వాంబే కాలానికి చెందిన  మహమ్మద్ మిరాజ్ పాషా , కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన సయ్యద్ ముజఫర్ ఆలీ, ఐదవ నిందితుడు

 ఒక మైనర్ గుర్తించడం జరిగిందన్నారు. పై వ్యక్తులు గతం లో  ఇదే విదంగా అమాయక వ్యక్తులను నమ్మించి కామారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల,ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లా ల పరిదిలో పిలిపించుకొని కొట్టి వారి వద్ద నుండి డబ్బులు ఫోన్ పే చేపించుకున్నారు. అనిందితులు ఈ విషయం లో  జైలు కి వెళ్ళడం జరిగిందన్నారు. అదే విధముగా ఈ నేరస్తుల మూలముగా ఎవరైనా మోసపోయి ఉన్నట్లయితే సంబదిత పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదు చేయగలరనీ ఆయన పేర్కొన్నారు. ఫిర్యాదు చేసిన వ్యక్తుల యొక్క  వివరములు గోప్యముగా ఉంచబడుతాయన్నారు.  ప్రస్తుతం ఈ ఐదుగురు వ్యక్తుల  వద్ద నుండి రూ.96,350 నగదు, నేరం చేయుటకు ఉపయోగించిన 6 సెల్ ఫోన్లను స్వాదినం చేసుకోనైనదన్నారు.

ఇకపై ఎవరైనా  కామారెడ్డి జిల్లాలో ఈ తరహ నేరం చేయడానికి ప్రయత్నించిన గాని లేదా నేరం చేసిన గాని వారిని ఆధునిక సాంకేతిక పద్దతుల ద్వార పట్టుకోవడం జరుగుతుందన్నారు.  నేరస్థులను కోర్టు ముందు ప్రవేశ పెట్టి కచ్చితంగా వాళ్లకు శిక్షలు పడే విధంగా చేస్తామని జిల్లా ఎస్పీ  పేర్కొన్నారు. ఎవరికైనా ఆపద సమయంలో కానీ, అనుమానితులు కనిపించిన సమయంలో కానీ, లేదా నేరం జరిగిన వెంటనే డయల్ 100 కు ఫోన్ చేసి సమాచారాన్ని తెలియజేలన్నారు. ఇలా వెంటనే సమాచారాన్ని పోలీస్ వారికి ఇవ్వడం ద్వారా నేరస్థులను వెంటనే పట్టుకునే అవకాశం ఉంటుందన్నారు.  ఈ కేసును చేధించడములో చాకచఖ్యముగా వ్యవహరించిన కామారెడ్డి పట్టణ ఎస్ హెచ్ ఓ  నరహరి, సిసిఎస్ ఇన్స్పెక్టర్  శ్రీనివాస్, ఎండి. ఉస్మాన్ ,  కామారెడ్డి పట్టణ ఎస్సైలు నరేష్, వినయ్ సాగర్, శ్రీరామ్, బాల్ రెడ్డి, రాజారామ్, సిసిఎస్  సిబ్బంది మైసయ్య, రవి, కామారెడ్డి పోలీస్ స్టేషన్  సిబ్బంది కమలాకర్, నరేష్, రాజు నాయక్, భాస్కర్, రమేష్, రవి, నవీన్, అనిల్, ప్రవీణ్ లను  ఈ సందర్భంగా అభినందిస్తున్నానన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -