Sunday, December 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ధాన్యం తడిసిందని ఆందోళనొద్దు: ఎమ్మెల్యే

ధాన్యం తడిసిందని ఆందోళనొద్దు: ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ – వనపర్తి
అకాల వర్షాలకు అక్కడక్కడ ధాన్యం తడుస్తోందని, ధాన్యం తడిసిందని రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేస్తామని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. పెద్దమందడి మండలం బలిజపల్లి గ్రామంలో శనివారం కురిసిన వర్షానికి తడిసిన వరి ధాన్యాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. త్వరలోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి అన్నదాతలు పండించిన చివరి ధాన్యపు గింజ వరకు కొనుగోలు చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి రమేష్ గౌడ్ తోపాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -