Wednesday, October 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అన్నదాతలకు ఆందోళన వద్దు

అన్నదాతలకు ఆందోళన వద్దు

- Advertisement -

చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే మేఘారెడ్డి
నవతెలంగాణ – వనపర్తి

అన్నదాతలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చివరి దాన్యపు గింజ వరకు కొనుగోలు చేస్తామని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి స్పష్టం చేశారు. బుధవారం పెద్దమందడి మండలం వెల్టూరు, వనపర్తి మండలం చిట్యాల సమీపంలోని వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డులో మహిళా సంఘాల ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి ఆయన ప్రారంభించారు. వనపర్తి జిల్లా పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు.

జిల్లా మొత్తంలో మొదటి విడతగా 396 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఇందులో మహిళా సంఘాల ద్వారా 170 కేంద్రాలు, పిఎసిఎస్ ద్వారా 218 కేంద్రాలు, మెప్మా ద్వారా 8 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకువచ్చే అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వాహకులు తగు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే నిర్వాహకులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు రామకృష్ణారెడ్డి, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు స్వరూప, మాజీ జెడ్పిటిసి రమేష్ గౌడ్, మాజీ ఎంపీపీ రఘు ప్రసాద్, మాజీ సర్పంచులు శ్రీనివాస్ రెడ్డి, వనపర్తి మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డి, శంకర్ నాయక్, సింగల్ విండో అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, రఘుపతిరావు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బి కృష్ణ, పట్టణ ప్రముఖ వైద్యులు, పగిడాల శ్రీనివాస్ రెడ్డి, ఎత్తం రవి, లక్కాకుల సతీష్, గోపాల్పేట ఉమ్మడి మండలాల ఇంచార్జ్ సత్యశీలారెడ్డి పట్టణ మాజీ కౌన్సిలర్లు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు, జిల్లా అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళా సంఘాల సభ్యురాలు రైతులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -