Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఆందోళన వద్దు 20 వరకు దరఖాస్తులు స్వీకరిస్తాం..

ఆందోళన వద్దు 20 వరకు దరఖాస్తులు స్వీకరిస్తాం..

- Advertisement -

నవతెలంగాణ – డిచ్ పల్లి
భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం అమలులో భాగంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, ఎవరైనా  చేసుకోకుంటే ఏలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈ నేలా 20వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని డిచ్ పల్లి, ఇందల్ వాయి తహసిల్దార్లు సతీష్ రెడ్డి, వెంకట్ రావు, డిప్యూటీ తహసిల్దార్ ఎం శైలజా లు పేర్కొన్నారు.డిచ్ పల్లి మండలం లోని ధర్మారం బి, బర్దీపుర్, ఖిల్లా డిచ్ పల్లి,ఇందల్ వాయి మండలంలోని సంస్థాన్ సిర్నపల్లి,గౌరరం గ్రామాలలో శుక్రవారం భూభారతి రెవెన్యూ సదస్సులు  నిర్వహించారు.ఈ సందర్భంగా తహసిల్దార్ లతో పాటు కిసాన్ ఖేత్ మండల అధ్యక్షులు ఎల్ ఐ సి గంగాధర్ మాట్లాడుతూ భూ సమస్యలు పరిష్కరించి, రైతులకు వారి భూములపై పూర్తి హక్కులు కల్పించేందుకే ప్రభుత్వం భూభారతి చట్టం అమలు చేస్తోందన్నారు. భూ రికార్డులలో పేరు తప్పులు, విస్తీర్ణం హెచ్చు తగ్గులు, వారసత్వ భూములు, భూ స్వభావం తప్పులు, నిషేధిత జాబితాలో ఉన్న భూ సమస్యలు, సర్వే నెంబర్ మిస్సింగ్, పట్టా పాస్ బుక్కులు లేకపోవడం, ప్రభుత్వ భూములను నవీకరించడం, సాదాబైనామా కేసులు, హద్దుల నిర్ధారణ, పార్ట్-బి లో చేర్చిన భూముల సమస్యలు, భూసేకరణ కేసులు తదితర భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించినట్లు వివరించారు.భూములకు సంబంధించిన ఏ విషయమున్నా తహసిల్దార్ లో దృష్టికి తీసుకుని రావాలని, తప్పుఓప్పులకు ఇదోకటి మంచి విషయమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలు పరిష్కారం అవుతాయని గంగాధర్ అశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమం లో  సీనియర్ అసిస్టెంట్ గంగా ప్రసాద్,డి చరణ్  , బాలకృష్ణ, రంజిత్, తోపాటు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad