విద్యుత్ శాఖ నిర్లక్ష్యంసై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ప్రజలు
నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రమాదం జరిగితేకాని విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోరా.? అని మండలంలోని పెద్దతూoడ్ల గ్రామ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గ్రామపచాయితీ వైపు వేళ్ళు ప్రధాన రహదారిపై విద్యుత్ స్తంభం ప్రమాదకరంగా ఉంది,లూజు పోల్ కింద స్తంభం తొలగించాలని నాలుగేళ్లుగా విద్యుత్ శాఖ అధికారులకు విన్నవించినా పేడ చెవిన పెడుతున్నారే తప్పా పట్టించుకోవడం లేదని పలువురు వాపోతున్నారు.
ఇప్పటికే నాలుగైదు సార్లు రోడ్డుపై ప్రమాదకరంగా ఉన్న స్తంభంతో పలువురుకి గాయాలైన సంఘటనలున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పోల్ తొలగించాలని పలుమార్లు అధికారులకు విన్నవించినా గుత్తేదారు చేయాలని,తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినట్లుగా పేర్కొంటున్నారని తెలిపారు.పెద్ద ప్రమాదం జరగకముందు స్తంభాన్ని ఇప్పటికైనా ఉన్నతాధికారులు తొలగించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రమాదం జరిగితే కాని పట్టించుకోరా.?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES