Friday, February 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్13వ వార్డు అభివృద్ధే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం.. 

13వ వార్డు అభివృద్ధే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం.. 

- Advertisement -

కాంగ్రెస్ అభ్యర్థి వీణ కిరణ్
నవతెలంగాణ – సంగారెడ్డి 

సంగారెడ్డి మున్సిపాలిటీలోని 13వ వార్డు అభివృద్ధిలో ఎంతో వెనుకబడి ఉందని, తాను గెలిస్తే వార్డును సమగ్రంగా అభివృద్ధి చేస్తానని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వీణ కిరణ్ అన్నారు. శుక్రవారం వార్డు ప్రజలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..“మీ ఇంటి బిడ్డగా మీ ముందుకు వచ్చాను. వార్డు అభివృద్ధే నా ప్రధాన లక్ష్యం. అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను” అని వార్డు ప్రజలను పేరుపేరునా ఓటు అభ్యర్థించారు.

అభ్యర్థి వీణ కిరణ్ మాట్లాడుతూ.. వార్డులో నెలకొన్న సమస్యలను స్థానిక నాయకుడు నిర్మల జగ్గారెడ్డి సహకారంతో పరిష్కరించి అభివృద్ధి దిశగా తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. వార్డు ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, ఎలాంటి దురుద్దేశాలకు తావివ్వకుండా అన్ని వర్గాల ప్రజలతో సమన్వయంతో పనిచేస్తానని తెలిపారు.

యువత అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడతానని, మహిళలకు రుణాలు ఇప్పించడంలో ప్రధాన పాత్ర పోషించి వారి ఆర్థిక స్థితి మెరుగుపడేలా కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -