Sunday, December 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇంటింటి ప్రచారం ముమ్మరం..

ఇంటింటి ప్రచారం ముమ్మరం..

- Advertisement -

నిజామాబాద్ లో దూసుకుపోతున్న బ్యాట్ గుర్తు
నవతెలంగాణ – వనపర్తి 

స్థానిక సంస్థల ఎన్నికల భాగంగా మూడో విడత ప్రచారం ముమ్మరంగా కొనసాగుతుంది. ప్రచారానికి ఒకరోజే అవకాశం ఉండడంతో అభ్యర్థులు తమ గుర్తులు కలిగిన ప్లకార్డులు, బ్యానర్లు, నమూనా బ్యాలెట్ పేపర్లు పంచుతూ తమతమ గుర్తులను చూయిస్తూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. పానగల్ మండలం నిజామాబాద్ గ్రామంలో అడుగడుగున ప్రజా ఆశీర్వాదంతో సర్పంచ్ అభ్యర్థి మరాఠీ లక్ష్మీ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రచారం కొనసాగుతు ముందుకు సాగుతూ ” బ్యాట్” గుర్తుకు ప్రతి ఓటరును అభ్యర్థిస్తున్నారు.

ఈ సందర్భంగా అభ్యర్థి లక్ష్మీ వెంకట్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో బెదిరింపు రాజకీయాలకు తావు లేదన్నారు. యువత రాజకీయం చేస్తే ఎలా ఉంటదో రాబోయే ఐదేళ్లో చూపిస్తామని హామీ ఇచ్చారు. ప్రజా ఆశీర్వాదంతో మనమే గెలుస్తున్నామని ప్రచారం నిర్వహించారు. తమ లక్ష్యం నిజామాబాద్ గ్రామ అభివృద్ధి అని, తమ ఆశయం ప్రజా సేవ అని అన్నారు. గ్రామస్తులు అమూల్యమైన ఓటు బ్యాట్ గుర్తుకు ఓటు వేసి, వేయించి అధిక మెజారిటీతో గెలిపించాగలరని కోరారు. ఇంటింటి ప్రచారంలో సర్పంచ్ అభ్యర్థి మరాఠి లక్ష్మి, వార్డు మెంబర్లు, గ్రామస్తులు ఓటర్లు యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -