నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్: తెలంగాణ రైసింగ్ కార్యక్రమంలో భాగంగా సోమవారం చౌటుప్పల్ మండలంలో విద్యుత్ ఉద్యోగులు గృహజ్యోతి పథకంపై ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సందేశంతో పాటు సంక్రాంతి శుభాకాంక్షల లేఖలను చౌటుప్పల్ విద్యుత్ శాఖ డి.ఈ డిఎస్ మల్లికార్జున్ ప్రజలకు అందజేశారు.గృహజ్యోతి పథకం కింద ప్రతి కుటుంబానికి ఉచితంగా 200 యూనిట్ల విద్యుత్ అందిస్తున్నట్లు ప్రజలకు వివరించారు. చౌటుప్పల్ మండలంలో సుమారు 15,600 కుటుంబాలు గృహజ్యోతి పథకం ద్వారా లబ్ధి పొందుతున్నాయని అలాగే 5,600 మంది వ్యవసాయ విద్యుత్ వినియోగదారులు కూడా ప్రయోజనం పొందుతున్నారని చౌటుప్పల్ విద్యుత్ డీఈ డి.ఎస్. మల్లికార్జున తెలిపారు. డీఈ డి.ఎస్.మల్లికార్జున్ ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ సిబ్బంది పట్టణంలోని ప్రతి ఇంటికి వెళ్లి లేఖలను అందజేసి, గృహజ్యోతి పథకం ప్రయోజనాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ విద్యుత్ ఏఈ సతీష్‌తో పాటు లైన్మెన్ తిరుమలయ్య,మీర్జా షకీల్,నవీన్ తదితరులు పాల్గొన్నారు
గృహజ్యోతి పథకంపై ఇంటింటి ప్రచారం: డిఈడిఎస్ మల్లికార్జున్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


