– క్షేత్రపరిశీలనలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ ఆదేశం
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రతి రోజూ తప్పనిసరిగా డోర్-టు-డోర్ చెత్త సేకరణ చేపట్టేలా పర్యవేక్షణ చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. బుధవారం జోనల్ కమిషనర్ రవి కిరణ్‌తో కలిసి జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇందిరా పార్క్, గాంధీ నగర్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వరకూ పారిశుధ్య తనిఖీలు చేపట్టారు. సురభి పార్క్, పీ అండ్ టీ కాలనీ, గాంధీ నగర్ డివిజన్, కవాడిగూడ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీప ప్రాంతాల్లో కమిషనర్ తనిఖీలు నిర్వహించారు. క్షేత్ర స్థాయిలో స్వచ్ఛ ఆటోల హాజరు, రెగ్యులర్ పారిశుధ్య కార్యకలాపాలను కమిషనర్ పరిశీలించారు. స్వచ్ఛ ఆటో పారిశుధ్య కార్మికులు ప్రతి రోజూ తప్పనిసరిగా డోర్-టు-డోర్ చెత్త సేకరణ చేసేలా పర్యవేక్షణ చేయాలని డిప్యూటీ కమిషనర్లు, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ డీఈఈ, ఏఈలను కమిషనర్ ఆదేశించారు. పబ్లిక్ ప్లేస్‌లు, పార్కులు, రహదారులు, రోడ్లు, జంక్షన్లు పరిశుభ్రంగా ఉండేలా ఫోకస్ పెట్టాలని సూచించారు. పారిశుద్ధ్య పర్యవేక్షణలో అలక్ష్యాన్ని సహించేది లేదని కమిషనర్ స్పష్టం చేశారు. నిరంతరం అప్రమత్తంగా ఉంటూ గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని పరిశుభ్ర నగరంగా తీర్చిదిద్దాలని కమిషనర్ కోరారు.
ప్రతి రోజూ డోర్-టు-డోర్ చెత్త సేకరణ చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



