Monday, May 5, 2025
Homeఆదిలాబాద్సైన్స్ కాలేజ్ లో దోస్త్ హెల్ప్ లైన్ ఏర్పాటు..

సైన్స్ కాలేజ్ లో దోస్త్ హెల్ప్ లైన్ ఏర్పాటు..

- Advertisement -

నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్: డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం దోస్త్ నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో జిల్లాలోని విద్యార్థుల సౌకర్యార్థం కోసం ప్రభుత్వ డిగ్రీ కళాశాల సైన్సెస్ లో దోస్త్ హెల్ప్ లైన్ సెంటర్ ను ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ జె సంగీత సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.  మే 3వ తేదీ నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంని అన్నారు. విద్యార్థులు దరఖాస్తు చేసుకునే సమయంలో ఏమైనా సమస్యలు వస్తే.. దోస్త్ హెల్ప్ లైన్ సెంటర్ ను సంప్రదించాలని సూచించారు. మూడు దశల ఆన్లైన్ దరఖాస్తుల కోసం హెల్ప్ లైన్ సెంటర్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. పూర్తి వివరాలకు దోస్తు కోఆర్డినేటర్ రవి కిరణ్, టెక్నికల్ అసిస్టెంట్ లు ఇమ్రాన్ అలీ, దుర్గా శేఖర్ లను 7702157284, 9703533626 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -