Monday, September 8, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్వర్షం ధాటికి కూలిపోయిన దోస్తుపల్లి కల్వర్టు.. 

వర్షం ధాటికి కూలిపోయిన దోస్తుపల్లి కల్వర్టు.. 

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని దోస్తుపల్లి గ్రామానికి వెళ్లే రహదారిపై నిర్మించిన ఖానాపూర్ శివారులోని అతి పురాతనమైన కల్వర్టు వర్షం దాటికి కూలిపోయిందని జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్, జుక్కల్ సీనియర్ అసిస్టెంట్ గల్కట్ వార్ రాజు తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం ఉదయం దోస్తుపల్లి గ్రామంలోని బ్రిడ్జి వద్దకు వెళ్లి మండల పరిషత్ సిబ్బంది పంచాయతీరాజ్ అధికారులతో వెళ్లి కూలిపోయిన కల్వర్టును పరిశీలించారు. సిబ్బందితో కలిసి ప్రమాదం చోటు చేసుకోకుండా ముందస్తుగా రోడ్డుపైన ఇరువైపులా ముళ్ళకంపలను వేయించారు. దోస్త్ పల్లి గ్రామానికి వాహనాలు వెళ్లాలంటే ప్రస్తుతం వెళ్లలేని దుస్థితి నెలకొందని అధికారులు తెలిపారు. తొందర్లోనే వాహనాలక రాకపోకలకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad